స్టార్ మాలో ప్రసారమవుతన్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ ఎపిసోడ్-5 లోకి అడుగుపెట్టింది. శనివారం నాటి ఎపిసోడ్ లో రాజ్ మళ్ళీ తిరిగి కావ్య దగ్గరికి వస్తాడు.
కావ్య, రాజ్ లకు ఇద్దరికి అవసరం ఉంది కాబట్టి ఇద్దరు కాంప్రమైజ్ అయినట్లు మాట్లాడుకుంటారు. కళ్యాణ్ "పూజ టైంకి జరగాలి.. మీరు వచ్చి ఆభరణాల డిజైన్ వేయండి" అని అంటాడు. అలా అనగానే "మీరు నాకు పూజకి ఎంట్రీ పాస్ లు ఇస్తేనే వస్తాను" అని చెప్తుంది. దానికి రాజ్ ఒప్పుకొని వాళ్ళింటికి తీసుకొస్తాడు. ఆ ఎంట్రీ పాస్ లు కనకంకి ఇస్తుంది కావ్య. కనకం ఆ ఎంట్రీ పాస్ లని పట్టుకొని శుభలేఖ అని సంతోషంతో గెంతులేస్తుంది.
కావ్య, రాజ్ వెళ్లేసరికి ఇక పూజ ఆగిపోతుందా అంటూ అందరూ అనుకుంటారు. అప్పుడే కావ్య, రాజ్ ఇద్దరు సీతారామయ్య దగ్గరికి వస్తారు. "పూజ జరుగుతుంది తాతయ్య... ఇదిగో ఆభరణాలు డిజైన్ వేసే అమ్మాయిని తీసుకొచ్చాను" అని కావ్యని చూపిస్తాడు. "సరే దగ్గర ఉండి ఆ అమ్మాయికి కావలసిన ఏర్పాట్లు చేయ్" అని సీతారామయ్య అంటాడు. కావ్య డిజైన్ వేసి అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సీతారామయ్య మెచ్చుకోవడంతో కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. "కావ్యకి తగిన పారితోషికం ఇవ్వు" అని సీతారామయ్య చెప్తాడు. ఎంట్రీ పాస్ లు పొందిన కనకం.. తన కూతుళ్ళని ఆ ఇంటికి ఎలా పరిచయం చేస్తుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.